టీడీపీ సర్కార్ కు కాలం దగ్గర పడింది

రుణ‌మాఫీ అంతా మోసం
కృష్ణాజిల్లా(కాటూరు):  రుణ‌మాఫీ అంతా ఓ మోస‌మ‌ని, ఎన్నిక‌ల ముందు రుణ‌మాఫీ చేస్తారని చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయామ‌ని వైయ‌స్సార్ సీపీ జిల్లా అధ్య‌క్షుడు కొలుసు పార్థ‌సార‌థి ఎదుట ప్రజలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని కాటూరు గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ స‌ర్కార్‌కు కాలం ద‌గ్గ‌ర ప‌డింద‌న్నారు. ప్ర‌జ‌ా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌న్నారు. 

2019లో వైయ‌స్సార్‌సీపీదే అధికారం
పుంగ‌నూరు:  ఎన్నిక‌ల స‌మయంలో అమ‌లుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు స‌రైన స‌మ‌యంలో త‌గిన విధంగా బుద్ది చెబుతార‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. 2019లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానికంగా ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. 

బాబు పాలనతో ప్రజలు విసిగిపోయారు
కురుపాం: చ‌ంద్ర‌బాబు నెర‌వేర‌ని హామీలు గుప్పించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశార‌ని వైయ‌స్సార్‌సీపీ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప‌శ్రీ‌వాణి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా పుష్ప‌శ్రీ‌వాణి మండ‌ల ప‌రిధిలోని ఇటిక గ‌ద‌బ‌వ‌ల‌స‌, ఇటిక‌లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ... టీడీపీ రెండున్న‌రేళ్ల పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌న్నారు. త‌ప్పుడు హామీలిచ్చి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అలాంటి హామీల‌తో ఏర్పడిన  ప్ర‌భుత్వం ఏమాత్రం నిల‌బ‌డ‌ద‌న్నారు


Back to Top