ఆల్ ఫ్రీ..అన్నీ మాఫీ అని చెప్పి నిండా ముంచాడు

తూర్పుగోదావరిః గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాబి సీతారామయ్య చౌదరి ద్వారపూడిలో పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, గృహనిర్మాణరుణాలు తదితర సమస్యలను స్థానికులు పట్టాబి దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు మాఫీ కాలేదని రైతులు, మహిళలు వాపోగా..నిరుద్యోగభృతి ఇవ్వడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టాబి మాట్లాడుతూ...ఆల్ ఫ్రీ, అన్నీ మాఫీ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజలను నిండా ముంచాడని మండిపడ్డారు. బాబు నయవంచనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Back to Top