తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టాడు

వ‌రి పంట ముగిసే వ‌ర‌కు నీళ్లివ్వాలి
ఆళ్ల‌గ‌డ్డ‌(దొర్నిపాడు): వ‌రి పంట చేతికొచ్చేవ‌ర‌కు కేసీ కెనాల్ కు నీళ్లివ్వాల‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ రామ‌లింగారెడ్డి వద్ద ప‌లువురు రైతులు మొర‌పెట్టుకున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం మండ‌ల ప‌రిధిలోని బాగ్య‌న‌గ‌రం గ్రామంలో నిర్వ‌హించారు. మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని, పింఛ‌న్లు, ఎన్టీఆర్ గృహాలు, మ‌రుగుదొడ్లు మంజూరు చేయించాల‌ని ఆయ‌న దృష్టికి తీసుకొచ్చారు. సీఎం ఓటుకు నోటు కేసులో తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెట్టాడ‌ని ఆరోపించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసి రాజ‌ధాని జ‌పం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గ‌ట్టాలి
నంద్యాల‌: ప‌్ర‌భుత‌త్వం ఉద్యోగుల‌పై చూపుతున్న నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని వైయ‌స్సార్‌సీపీ నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌లికిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. పోస్ట‌ల్ ఉద్యోగుల‌కు బోన‌స్ అల‌వెన్స్ ఇవ్వాల‌ని చేప‌ట్టిన ఒక్క‌రోజు దీక్ష‌కు ఆయ‌న మ‌ద్ద‌తు ఇచ్చి వారి స‌మ‌స్య‌ల‌పై అసోసియేష‌న్ నాయ‌కుల‌తో చ‌ర్చించారు. చంద్ర‌బాబు చేత‌కానీ పాల‌న వ‌ల్లే ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీడీపీ స‌ర్కార్‌కు త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడతార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌జా సంక్షేమం ప‌ట్ట‌ని ప్ర‌భుత్వం
నందికొట్కూరు(పాముల‌పాడు):  నిత్యం అమ‌రావ‌తి భ‌జ‌న చేస్తూ ప్ర‌జాసంక్షేమాన్ని గాలికొదిలేశార‌ని పాల‌క‌ప‌క్షం ఎమ్మెల్యే ఐజ‌య్య మండిప‌డ్డారు. మండ‌ల ప‌రిధిలోని వేంపెంట గ్రామంలో ఆయ‌న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ నిర్వ‌హించారు. ప్ర‌తి పేద‌వాడి త‌లుపుత‌ట్టిన ప‌థ‌కాలు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హాయంలోనే అమ‌ల‌య్యాయ‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు అధికారం కోసం చంద్ర‌బాబు అమ‌లు కానీ హామీల‌ను ఇచ్చి ప్ర‌జ‌ల‌ను న‌ట్టేటా ముంచార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

Back to Top