చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి

–ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి
వల్లంపట్ల(ఎ.కొండూరు): ఎన్నికల్లో ఇచ్చిన వాగ్థానాలు గాలికొదిలేచిన చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి విమర్శించారు. మండలంలోని వల్లంపట్ల గ్రామంలో శనివారం వైయస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో వైయస్సార్‌ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ ప్రశ్నలతో కూడిన కరపత్రాలను అందించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ... మండలంలోని అన్ని గ్రామాల్లో బూత్‌కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు, నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. నిరుద్యోగ బృతి ఏమైందని, ఇంటికో ఉద్యోగం ఎక్కడ ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డ్వాక్రా, రైతు రుణామాఫీ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌ నిరుపేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి జగనన్న ప్రభుత్వానికి ప్రజలు కట్టం కట్టే రోజులు దగ్గర పడుతున్నాయని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేద ప్రజలందరికి పథకాలను అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పాలం ఆంజనేయులు, వైయస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షులు భూక్య గనియా, నాయకుడు జూపల్లి రాజేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మధుసూథనరెడ్డి, బూత్‌ కమిటీ సభ్యులు దేవదాసు, వీ. శ్రీనివాసరావు, నాని, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Back to Top