పేదల సంక్షేమం పట్టని ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి

పాణ్యంః

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని వైయస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. గడివేముల మండలంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా బాబు పాలనపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో అనర్హులకు పథకాలు కట్టబెడుతూ నిరుపేదలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం పట్టని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


Back to Top