చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పండి

విశాఖపట్నం(గొలుగొండ): ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న చంద్రబాబుకు త్వరలో గుణపాఠం తప్పదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నర్సీపట్నం కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ హెచ్చరించారు. గాదంపాలెం గ్రామంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వందల హామీలు ఇచ్చారని.. వీటి లో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు.  డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు కనీసం వాటి గురించి పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ అధికారంలోనికి వచ్చి 30 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు.  ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా నిరుద్యోగులను తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

పాయకరావు పేట నియోజకవర్గంలో సమన్వయకర్తలు గొల్ల బాబురావు, వీసం రామకృష్ణ గడప గడప కి వైయస్ఆర్ కార్యక్రమమును నక్కపల్లి మండలం బంగారమ్మ పేట మండలంలో నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ మోసపూరిత విధానాలను గడపగడపలో ఎండగట్టారు. అబద్ధపు హామీలతో మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top