కోడుమూరు)) చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. బాలాజీనగర్‌లో గడపగడపకు వైయస్‌ఆర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి తాను గొప్ప మేధావినని బాబు కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మురళీకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మణిగాంధీ కాలనీల్లో విందులు వినోదాలకు వస్తారు తప్ప సమస్యలు గురించి పట్టించుకోవడం లేదని వాపోయారు. <br/>