గిరిజనులపై టీడీపీ కక్షసాధింపు చర్యలు

శ్రీకాకుళంః టీడీపీ ప్రభుత్వం గిరిజనులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని దిమ్మిడిజోల పంచాయతీ సవరరాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ప్రజలకు వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్న కక్షతో ప్రభుత్వం అన్యాయంగా తమ పింఛన్లు తొలగించిందని పలువురు మహిళలు తిలక్ వద్ద వాపోయారు. రానున్న ఎన్నికల్లో బాబు పాలనకు చరమగీతం పాడాలని తిలక్ ప్రజలకు పిలుపునిచ్చారు.


Back to Top