టీడీపీవి జన వంచన యాత్రలు

కర్నూలు(ఆదోని))టీడీపీ నేతలు చేస్తున్నది జన చైతన్యయాత్రలు కాదని జన వంచన యాత్రలని ఆదోని ఎ్మమెల్యే సాయిప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదోని మండలం ఆరెకల్లు గ్రామంలో సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు ఎమ్మెల్యేకు పూలమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్ రెడ్డి గడపగడపకూ తిరిగి బాబు ఇచ్చిన దొంగ హామీల గురించి వివరించారు. స్వయాన చంద్రబాబు కోడలు బ్రాహ్మణి చేయించిన సర్వేలో టీడీపీకి 56 సీట్లు కూడా రావని నివేదిక సమర్పించిందని ఎమ్మెల్యే తెలిపారు. బాబు పాలనపై ప్రజలు విసుగుచెందారని సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా వైయస్ జగన్ సీఎం అవుతారని, వైయస్ఆర్ ఆశయాలను నెరవేరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారని సాయిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


Back to Top