వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం తప్పదు

శ్రీకాకుళంః టెక్కలి నియోజకవర్గంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపలో విస్తృతంగా పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని, ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిలక్ అన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి ఓటేసి మోసపోయామని ప్రజలు వాపోయారు. మళ్లీ ఓట్ల కోసం టీడీపీ నాయకులు తమ గ్రామాల్లోకి వస్తే తరిమికొడతామని హెచ్చరించారు.


Back to Top