ఇక టీడీపీకి పుట్టగతులుండవ్

కర్నూలు))ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజాసమస్యలు తెలుసుకుంటూ వైయస్సార్సీపీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. ప్రజల పార్టీకి గడపగడపలో జనం నీరాజనం పడుతున్నారు. అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్న టీడీపీ సర్కార్ పై ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని పచ్చపార్టీపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదొంగల పార్టీని తరిమికొడతామని అంటున్నారు.గడపగడపలో  వైయస్సార్సీపీకి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ అవినీతిపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న వైయస్ జగన్ కు జనం జేజేలు పలుకుతున్నారు. రానున్న ఎన్నికల్లో రాజన్న బిడ్డ వైయస్ జగన్ ను సీఎం చేసుకొని తమ జీవితాలను బాగుచేసుకుంటామని ప్రతిన బూనుతున్నారు. టీడీపీకి ఇక రాష్ట్రంలో పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నారు. 

Back to Top