టీడీపీకి కాలం చెల్లింది..వచ్చేది మన ప్రభుత్వమే

మోసం.. ద‌గా...
జ‌గ్గంపేట‌:  తెలుగుదేశం పార్టీ మోసం... ద‌గాకు మారుపేరుగా మారాయ‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ ముత్యాల శ్రీ‌నివాస్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయన పెంట‌ప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి, బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు.

ఓట్లు వేసి మోస‌పోయాం
ముమ్మిడివ‌రం: ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్రబాబు మాట‌లు న‌మ్మి ఓట్లు వేశాం. తీరా అధికారంలోకి వ‌చ్చాక నిలువునా మోసం చేశాడ‌ని కొత్త‌లంక గ్రామ‌స్తులు వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న కొత్త‌లంక పంచాయ‌తీలోని ద‌మ్ముగూడెం, బంద‌రుపాలెం ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ ప్ర‌భుత్వాన్ని న‌మ్మిమోసపోయామని ప్రజలు చెబుతున్నారని ఆయన తెలిపారు.


అవినీతి పాల‌న‌లో టీడీపీ ముందంజ‌
ఎమ్మిగ‌నూరు(నాగ‌ల‌దిన్నె): అవినీతిలో టీడీపీ ప్ర‌భుత్వం ముందంజ‌లో ఉంద‌ని వైయ‌స్సార్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ఎర్ర‌కోట జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మాల‌గేరి, ఎస్సీ, బీసీ కాలనీ, కోట‌వీధి, క‌టిక‌గేరిలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. చంద్ర‌బాబు రెండున్న‌రేళ్ల పాల‌న‌లో అవినీతికి అడ్డే లేకుండా పోయింద‌న్నారు. రాజ‌ధాని పేరుతో విదేశాలు తిరుగుతూ పాల‌నా వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్ఠు ప‌ట్టించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త కోల్పోవ‌డం బాబు వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని ఎద్దేవా చేశారు.

మా ఉసురు త‌గులుతుంది
అన‌ప‌ర్తి: వ‌య‌సు మీద ప‌డింది... ఏ ప‌ని చేయ‌లేనిస్థితిలో ఉన్నాం... ఏ ఆధారం లేక బ‌తుకు భారంగా మారింద‌ని ప‌లువురు వృద్ధులు వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ సూర్య‌నారాయ‌ణ ఎదుట వాపోయారు. మాయ మాట‌లు చెప్పి గ‌ద్దెనెక్కిన చంద్రబాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఇళ్ల స్థ‌లాలుగానీ, గృహ నిర్మాణ రుణాలుగానీ మంజూరు చేయ‌లేద‌ని ఆయ‌న వివ‌రించారు. 2019లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి త‌థ్యమ‌న్నారు. 


Back to Top