ప్రజల పాలిట శాపంగా టీడీపీ సర్కార్ పనితీరు

హౌసింగ్ రుణం కోసం ఎదురుచూపులు
రాజ‌మండ్రి:  విద్యుత్‌షార్ట్ స‌ర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయింది. హౌసింగ్‌లోను వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో అప్పులు చేసి ప‌క్కా ఇల్లు కట్టుకున్నాను. ఇంత‌వ‌ర‌కు లోను రాలేదని ప‌లివెల స‌త్య‌నారాయ‌ణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ ఆకుల వీర్రాజు ఎదుట వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని క‌డియ‌పులంక గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను వంచించ‌డ‌మే ధ్యేయంగా స‌ర్కారు ప‌ని తీరు ఉందని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

స‌మ‌స్య‌ల న‌డుమ గిడ‌జాం
ప్ర‌తిపాడు: మ‌ండ‌లంలోని గిడ‌జాం ఈబీసీకాల‌నీ స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ ప‌ర్వ‌త పూర్ణ‌చంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానికంగా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... టీడీపీ మాట‌ల ప్ర‌భుత్వ‌మే త‌ప్ప చేత‌ల ప్ర‌భుత్వం కాద‌ని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ల‌క్ష్యం కేవ‌లం అవినీతి, అక్ర‌మాలేన‌న్నారు. ఎన్నిక‌లకు ముందు అమ‌లుకు సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చాక వాటిని విస్మ‌రించి ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ద‌గాకోరు ప్ర‌భుత్వం టీడీపీ ప్ర‌భుత్వమ‌ని ధ్వ‌జమెత్తారు. రానున్న‌ది జ‌గ‌న‌న్న రాజ్య‌మ‌ని, అప్పుడు త‌మ స‌మ‌స్య‌ల‌న్నీ తీరుతాయని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు హామినిచ్చారు. 

Back to Top