టీడీపీ రాక్షసపాలనను తరిమికొడదాం

తూర్పుగోదావరి: రాష్ట్రంలోని రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలంతా వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములు కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాష్‌రావు అన్నారు. రౌతు సూర్యప్రకాష్‌రావు ఆధ్వర్యంలో రాజమండ్రి ఐదో వార్డులో వైయస్‌ఆర్‌ కుటుంబం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలంతా విసుగుచెందారన్నారు. వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై ప్రజలంతా ఆయన వెంట నడుస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కిరణ్‌కుమార్‌రెడ్డి, వీరబాబు, తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Back to Top