ప్రజల్లో ఉనికి కోల్పోయిన టీడీపీ

కర్నూల్ జిల్లాః బనగానపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి సంజామల మండలం నట్లకొత్తూరు, హోత్రమనుదిన్నె గ్రామాల్లో గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్యప్రకాష్ రెడ్డి ,యువత రాష్ట్ర కార్యదర్శి పోచ శీలరెడ్డి హాజరు అయ్యారు . గ్రామంలోని ప్రతి ఇంటికి ,ప్రతి గడప కు వెళ్లి  ప్రజాబ్యాలట్ ను ఇచ్చి వారికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాల గురించి సవివరంగ తెలియచేశారు . చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల హామీల్లో కనీసం ఇప్పటికయినా వంద హమీలైన నెరవేర్చాడ అని తన అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజా బ్యాలట్ ను ప్రజల వద్దకు పంపించడం జరిగిందని  చెప్పారు.  

గడప గడపకు వైయస్సార్ కార్యక్రమానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని రామిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గుబులు పుడుతుందని, అందుకే వారు గ్రామాల్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉనికి కోల్పోయిందని చెప్పారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళిన కూడా పించన్ లు ,సిసి రోడ్స్ ,మంచినీటి సౌకర్యం లాంటి ప్రధాన సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. ప్రజా సంక్షేమాలు కుంటు పడకుండా తమ నాయకుడు జగన్ సహాయ సహకారాలతో ప్రజా సమస్యల మీద ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతున్నామన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలు తొలగిపోతాయని రామిరెడ్డి  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సిద్దం రెడ్డి రామ్ మోహన్ రెడ్డి, సంజామల ZPTC బాబు, మండల పరిషద్ అధ్యక్షుడు గౌరు ఓబుల రెడ్డి ,మండల కన్వినర్ రామచంద్ర రెడ్డి , నట్లకొత్తూరు ,హోత్రమనుదిన్నె గ్రామా నాయకులూ రవి,రామకృష్ణారెడ్డి ,ప్రజలు ,కార్యకర్తలు పాల్గొన్నారు

Back to Top