టీడీపీ రాక్షస పాలన అంతమొందడం ఖాయం

ప్రకాశంః అర్దవీడు మండలం పెద్ద దొనకొండ  (పంచాయతీ) గ్రామంలో గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించి  ఐవీరెడ్డికి ఘనస్వాగతం పలికారు. ప్రతి గడపలో ఐ.వి.రెడ్డికి మహిళలు హారతులు పట్టారు. అనంతరం  ఐ.వి.రెడ్డి మాట్లాడుతూ ..దేశంలో ఎక్కడా లేన దౌర్జన్య పాలన ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని విమర్శించారు  చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాల గురిచి ప్రజలకు తెలియచేసారు.  టీడీపీ రాక్షస పాలన తొందరలోనే ముగుస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్ పక్షాన నిలవాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, అర్దవీడు మండల నాయకులు, గ్రామ ప్రజలు,అభిమానులు,ఐ.వి.రెడ్డి యువసేన పాల్గొన్నారు.


Back to Top