టీడీపీ రాక్షస పాలన అంతమొందడం ఖాయం

ప్రకాశంః సరైన రోడ్లు, మురుగు కాల్వలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చీరాల మునిసిపాలిటీ 7వ  వార్డు ప్రజలు వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ యడం బాలాజీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.  బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.అమృతపాణితో కలిసి బాలాజీ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హామీలు, అవినీతి పాలనపై ప్రజాబ్యాలెట్ ను వార్డులను ప్రజలకు అందించారు. ఈసందర్భంగా బాలాజీ మాట్లాడుతూ...టీడీపీ రాక్షస పాలన తొందరలోనే ముగుస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్ పక్షాన నిలవాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Back to Top