దోపిడీ ప్రభుత్వం

ప్రజల అవస్థలు పట్టడం లేదు
శ్రీకాకుళం: ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సవర బూదమ్మ. ఈమెకు నా అంటూ ఎవరూ లేరు.  ఉన్న కాస్త రేకుల షెడ్డు వర్షానికి కారుతుండడంతో ఇంటిపైకి ఎక్కి సిమెంట్ రాసేందుకు అష్టకష్టాలు పడుతోంది. ప్రతీ ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు...కొత్త ఇళ్లు కాదు గదా ఉన్న పాత ఇళ్లులకు బిల్లులు కూడా మంజూరు చేయని దుస్థితి. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఎగువ మెట్టుగూడ, దిగువ మెట్టుగూడ తదితర గ్రామాల్లో పాలకొండ ఎమ్మెల్యే కళావతి పర్యటించారు. ఈసందర్భంగా ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. బాబు మోసాలను ఎండగట్టారు. అండగా ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. 

విచ్చలవిడిగా దోచేస్తున్నారు
కర్నూలు(శ్రీశైలం)) సాగునీటి ప్రాజెక్ట్ ల పేరుతో దోపిడీకి పాల్పడుతూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని శ్రీశైలం నియోజకవర్గ ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి  మండిపడ్డారు. బండి ఆత్మకూరం మండలం ఈర్నపాడులో గడపగడపలో పర్యటించారు. హామీల అమలుపై మార్కులు వేయాలని ప్రజలను కోరారు. పట్టిసీమ మాదిరే పోలవరం ప్రాజెక్ట్ లోనూ కోట్లాది రూపాయలు దండుకునేందుకు బాబు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పాలనను తరిమికొట్టాలని ప్రజలకు సూచించారు. 

తాజా ఫోటోలు

Back to Top