టీడీపీ వచ్చాక అన్నీ కష్టాలే

క‌ర్నూలు(ప‌గిడ్యాల‌):  కేసీ కాలువ‌కు సాగునీరు విడుద‌ల చేయించి ఆయ‌క‌ట్టు రైతుల‌ను ఆదుకుంటాన‌ని నందికొట్టూరు ఎమ్మెల్యే వై. ఐజ‌య్య రైతుల‌కు భ‌రోసానిచ్చారు. ప‌గిడ్యాల మండ‌లం ప్రాత‌కోట గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం ఎమ్మెల్యే ఐజ‌య్య ఆధ్వ‌ర్యంలో కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌కు సాగునీటి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు.  రెండు పంట‌ల‌కు సమృద్ధిగా నీటి విడుద‌ల చేసి రైతుల‌ను ఆదుకున్న రైతుబాంధ‌వుడు వైయ‌స్సార్ మాత్ర‌మేన‌ని ఎమ్మెల్యే ఐజ‌య్య పేర్కొన్నారు. 


క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ బుడ్డా శేషారెడ్డి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగింది. ఆత్మ‌కూరు మండ‌లం సిద్ద‌ప‌ల్లి గ్రామంలో శేషారెడ్డి ప‌ర్యటించి వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌లకు అంద‌జేశారు. అనంత‌రం చంద్ర‌బాబు పాల‌న‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌తో మార్కులు వేయించారు. ఈసందర్భంగా బాబు పాలనపై ప్రజలు దుమ్మెత్తిపోశారు. అబద్ధపు హామీలతో తమను మోసం చేసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 

Back to Top