వైయస్సార్సీపీలోకి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు

అనంతపురంః పి. రామగిరిలో వైయస్సార్సీపీ సమన్వయకర్త తిప్పేస్వామి ఇంటింటికీ వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి వైయస్సార్సీపీలో చేరారు. రాయదుర్గం పట్టణం అంబేద్కర్ కాలనీలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఉపేందర్ రెడ్డిలు వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత వైయస్ఆర్ స్వర్ణయుగాన్ని గుర్తు చేశారు. బాబు మోసపూరిత పాలనను ప్రజలకు వివరించారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. ఊరువాడ అంతటా వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

తాజా ఫోటోలు

Back to Top