ఏపీని నాశనం చేస్తున్నారు

తూర్పుగోదావరి(కాకినాడ): వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడలో గడపగడపలో పర్యటించారు. ఎన్నికల హామీలకు సంబంధించి ప్రజలకు కరపత్రాలు అందించి సమాధానాలు రాబట్టారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ...చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పట్టడం లేదని ఫైర్ అయ్యారు. వెంకయ్యనాయుడు జాతీయ నాయకుడిగా గాకుండా చంద్రబాబుకు అధికార ప్రతినిధి వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. 

చంద్రబాబు ఏం చెబితే వెంకయ్యనాయుడు అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలన్న బీజేపీ మంత్రులు అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. బాబు, వెంకయ్యనాయుడు మాటలను ప్రజలు వినేపరిస్థితుల్లో లేరని చెప్పారు.  ఆనాడు కాంగ్రెస్ , బీజేపీ, టీడీపీలు కుట్రచేసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇవాళ మళ్లీ ఏపీని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ ప్రజలను మోసం చేస్తే  బాబు, వెంకయ్యనాయుడులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. Back to Top