అడ్డగోలుగా పన్నులు పెంచుతున్నారు

నాయుడుపేట: నగర పంచాయతీ అధికారులు పన్నులు ఇష్టారీతిగా పెంచేస్తూ సమస్యలపై పట్టించుకోవడం లేదని మహిళలు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మొరపెట్టుకున్నారు. పట్టణంలోని 9వ వార్డు పరిధిలోని అమరాగార్డెన్‌లో  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ రఫీ ఆధ్వర్యంలో ఎఎమ్మెల్యే సంజీవయ్య గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీ, ఇంటి స్థలాలు, పింఛన్లు తదితర సమస్యలపై బాధితులు వారి ఆవేదనను ఎమ్మెల్యే సంజీవయ్యకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 


Back to Top