నిర్వాసితుల‌కు తోడుగా ఉంటాం

శ్రీ‌కాకుళం:  హిరమండలం రిజర్వాయర్‌ ముంపు గ్రామాల నిర్వాసితుల‌కు అండ‌గా ఉంటామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాకుళం జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి అన్నారు. శ‌నివారం హిర మండ‌లం గ‌ర్ల‌పాడు పంచాయ‌తీలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రెడ్డిశాంతి రిజ‌ర్వాయ‌ర్ ముంపు గ్రామాల నిర్వాసితుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ..వంశధార రిజర్వాయర్‌ నిర్వాసితులకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన  పరిహారం ప్యాకేజీ ఇవ్వాలన్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్‌ఆర్‌ ప్యాకేజీని విడుదల చేయకుండా, నిబంధనలు పాటించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు 5 సెంట్లు ఇల్లు స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాని డిమాండ్‌ చేశారు. 


Back to Top