నవరత్నాల సభను విజయవంతం చేయండి

చింతూరు: ఈనెల 12న కూనవరంలో జరిగే నవరత్నాల సభను విజయవంతం చేయాలని వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఎగుమంటి రామలింగారెడ్డి కోరారు. శనివారం చింతూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అధ్యక్షుడు ప్రకటించిన నవరత్నాల పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని, దీనిపై గ్రామగ్రామాన, ప్రతి ఇంటికీ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను రద్దుచేస్తూ పేదలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో వారంతా టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. కూనవరంలో జరిగే నవరత్నాల సభకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ్‌భాస్కర్‌ హాజరవుతారని, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు సోయం అరుణ, ఎంపీటీసీ సభ్యురాలు సోడె బాయమ్మ, నాయకులు ఎండీ మూసా, మన్మధహరి, సుధాకర్, తమ్మయ్య, నాగార్జున, రమణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top