సమస్యల వలయంలో రాష్ట్రం

జ‌న్మ‌భూమి క‌మిటీతో స‌మ‌స్య‌లు
ఆళ్ల‌గ‌డ్డ‌(ఉయ్యాల‌వాడ‌):  గ్రామంలో టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌ను జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యులుగా నియ‌మించి స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నార‌ని ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్సార్‌సీపీ ఇంచార్జ్ రామ‌లింగారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని బోడెమ్మ‌నూరు మ‌జారా, పుచ్చ‌కాయ‌ల‌ప‌ల్లెలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. అనంత‌రం మాట్లాడుతూ... చంద్ర‌బాబు పాల‌న‌కు కాలం చెల్లింద‌ని దుయ్యబట్టారు. 

బాబు పాల‌న‌లో గ్రామాలు అధోగ‌తి
శ్రీ‌శైలం(మ‌హానంది): చ‌ంద్రబాబు పాల‌న‌లో గ్రామాలు అభివృధ్ధికి నోచుకోవ‌డం లేద‌ని వైయ‌స్సార్ సీపీ శ్రీ‌శైలం నియోజ‌వ‌క‌ర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న బొల్ల‌వ‌రం గ్రామంలో ప‌ర్య‌టించారు. ప్ర‌తి గ్రామంలో స‌మ‌స్య‌లు రాజ్య‌మేలుతున్నాయ‌న్నారు. పుష్క‌రాల పేరుతో వేల కోట్ల రూపాయ‌లు వృథా చేసిన ప్ర‌భుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పైసా విడుద‌ల చేయ‌డం లేద‌న్నారు. 


Back to Top