సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు

న‌య‌వంచ‌కుడు చంద్ర‌బాబు
శ్రీ‌కాకుళం(కొత్తూరు): ప‌్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేసిన న‌య‌వంచ‌కుడు చంద్ర‌బాబు అని వైయ‌స్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా  కొత్తూరు మండ‌లం మాక‌వ‌రంలోఆమె ప‌ర్య‌టించారు. అర్హుల‌కు ఇళ్లు మంజూరు కావడం లేద‌ని ప‌లువురు  రెడ్డిశాంతి ఎదుట వాపోయారు. వంద‌ప్ర‌శ్నల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి, చంద్ర‌బాబు  హామీల‌పై మార్కులు వేయించారు. మోసపూరిత పాలనకు స్వస్థి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఒక్క ఇళ్లూ మంజూరు చేయ‌లేదు
శ్రీ‌కాకుళం(గార‌):  టీడీపీ ప్ర‌భుత్వంలో సంక్షేమ ప‌థ‌కాలు నిలిచిపోతున్నాయ‌ని బోర‌వానిపేట పంచాయ‌తీ ప్ర‌జ‌లు వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా బోర‌వానిపేట పంచాయ‌తీ ప‌రిధిలోని తాళ్ల‌వ‌ల‌స‌, బోర‌వానిపేట‌లో ధర్మాన ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్ల‌ు దాటినా అభివృధ్ధి మచ్చుకు కూడా క‌నిపించ‌డం లేద‌ని విమర్శించారు. 

రాక్ష‌స పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడుతాం
శ్రీకాకుళం(రాజాం):  రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు ప్ర‌జ‌లంతా ఐక్య‌పోరాటానికి సిద్ధం కావాల‌ని ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. రాజాం మండ‌లం గుర‌వాం గ్రామంలో ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌జా సంక్షేమాన్ని పూర్తిగా విస్మ‌రించి, రాజ‌ధాని నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయ‌లు దోపిడి చేస్తున్నార‌ని ఆరోపించారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదాను కాద‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీని ఎలా అంగీక‌రిస్తార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

Back to Top