రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు

పాణ్యం))చంద్ర‌బాబు పాల‌న రాష్ట్రానికి చీక‌టి రోజుల‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా పాణ్యంలోని 27వ వార్డులో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌లకు త్వ‌ర‌లొనే విముక్తి చేకూర్చ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌స్తార‌ని ఆమె తెలిపారు. ఆమె గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేశారు. చంద్ర‌బాబు చేసిన మోసాలను గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

చంద్ర‌బును త‌రిమికొట్టాలి
నంద్యాల‌))చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను గాలికొదిలి.... పుష్క‌రాలు, అమ‌రావ‌తి అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయ‌న 37వ వార్డులో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు క‌ర‌ప‌త్రాలు పంచి చంద్ర‌బాబు మోసాల‌ను తెలియ‌జేశారు. చంద్ర‌బాబు పాల‌న ఘోరంగా ఉంద‌న్నారు. 

బాబు పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు
క‌నిగిరి))చంద్ర‌బాబు పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని క‌నిగిరి నియోజ‌కవ‌ర్గం వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు తెలిపారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీసీ కార్య‌క్ర‌మంలో భాగంగా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం సీఎస్ పురం మండ‌లం, అగ్ర‌హారం గ్రామంలో ప‌ర్య‌టించారు. 

చేత‌గాని ప్ర‌భుత్వం
జ‌గ్గంపేట‌))ప్ర‌జ‌ల‌కోసం పాల‌కులు ఉండాలి కానీ పాల‌కుల కోసం ప్ర‌జ‌లు వేచిచూడ‌కూడ‌ద‌ని జ‌గ్గంపేట నియెజ‌క‌వ‌ర్గం వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు తెలిపారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు.  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం, గండేప‌ల్లె మండ‌లం, సురాంపాళెం గ్రామంలో పర్యటించారు. 

 ప్ర‌జాధ‌నాన్ని వృథా చేస్తున్నారు.
ముదినేప‌ల్లి)) ముదినేప‌ల్లి మండ‌లం వి.రావిగుంట గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మం విజయవంతంగా సాగుతోంది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో త‌ర‌గ‌ని ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని, వైయ‌స్ జగన్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని నేతలు తెలిపారు. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల ర‌క్తం తాగుతూ రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌జ‌లు రామ‌రాజ్యం కోరుకుంటుంటే చంద్ర‌బాబు రాక్ష‌స‌పాల‌న అందిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.  కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.


తాజా ఫోటోలు

Back to Top