వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన

పుంగనూరు టౌన్‌: వైయస్‌ఆర్‌ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన పుంగనూరులోని 4 వ వార్డులో వైయస్‌ఆర్‌ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సభ్యత్వ నమోదు కోసం స్వచ్ఛందంగా ఇళ్లకు రమ్మని ఆహ్వానిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలో కూడా ప్రతిచోటా ఇదే విధంగా ఉందన్నారు. శాసనసభ్యులు, కో-ఆర్డినేటర్లు ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. అక్కడ బూత్‌ కమిటీ సభ్యులందరినీ కలిసే విధంగా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. అలాగే అక్టోబర్‌ 27 నుంచి ఆయన పాదయాత్ర ఉంటుందన్నారు. నవరత్నాల సంక్షేమ పథకాలపై కొంతమంది మరిన్ని సూచనలు ఇచ్చారన్నారు. వాటన్నిటినీ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత ఎన్నికల ముందు రూపొందించే మేనిఫెస్టోలో పథకాలను చేర్చుతామన్నారు.

తాజా ఫోటోలు

Back to Top