నవరత్నాలకు విశేష స్పందన

శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో నవరత్నాల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుగా ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ ప్రకటించిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించాడో ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీలు, బెదిరింపులు, ప్రలోభాలకు దిగుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ తగిన గుణపాఠం చెప్పే విధంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలన్నారు. మహానేత రాజన్న రాజ్యం తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top