అన్ని వర్గాల సమస్యల పరిష్కారం వైయస్ జగన్ తోనే సాధ్యం

నెల్లూరు(నాయుడుపేట)) డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని చెప్పి బాబు మోసం చేశారని పొదుపు సంఘాల మహిళలు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు విన్నవించారు. నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. మోసపూరిత వాగ్దానాలతో బాబు అన్ని వర్గాల ప్రజలను వంచించాడని సంజీవయ్య విమర్శించారు. ప్రజాసమస్యలు పరిష్కారం కావాలంటే అంతా ఏకమై వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇంటింటికీ తిరిగి ప్రజాబ్యాలెట్ ను పంపిణీ చేసి బాబు మోసపూరిత హామీలపై మార్కులు వేయించారు.
Back to Top