ఏ గ‌డ‌ప తొక్కినా ఒకటే మాట‌

  • బాబుకు ఓటేసి మోస‌పోయాం
  • జ‌న్మ‌లో బాబుకు ఓటు వేయం

ఏ గ‌డ‌ప తొక్కినా... ఏ మ‌నిషిని ప‌ల‌క‌రించినా ఒకే మాట.  బాబుకు ఓటేసి మేము మోసపోయాం....  జ‌న్మ‌లో బాబుకు ఓటువేయ‌మ‌ని. ఎన్నిక‌ల‌కు ముందు త‌ల‌కుమించిన హామీల‌ను ఇచ్చి ఎన్నిక‌ల అనంత‌రం వాటిని విస్మ‌రించిన నేప‌థ్యంలో వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో ప్ర‌తీఒక్క‌రూ బాబుపై మండిపడుతున్నారు. సూళ్లూరుపేట మండ‌లం కొమ్మినేనిప‌ల్లిలో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు

న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం యార‌బాడు గ్రామ‌పంచాయ‌తీలో వైయస్సార్సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించారు. ఈసందర్భంగా బాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఎంతో అభివృద్ధి చేస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న చంద్ర‌బాబు ఒక్క‌సారి విమానాలు దిగి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే వారి క‌ష్టాలు తెలుస్తాయ‌ని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ అన్నారు.  నెల్లూరులోని 52వ డివిజ‌న్ రంగ‌నాయ‌కుల‌పేట‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. బాబుకు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌పై ఉన్న శ్ర‌ద్ధ రాష్ట్రాభివృధ్ధిపై లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. 

పేద‌వాడి ఆరోగ్యం కోసం దివంగ‌త ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని టీడీపీ ప్ర‌భుత్వం పూర్తిగా నిర్మూలిస్తోందని తూర్పుగోదావరి జిల్లా మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడు ప‌ట్టాభి రామ‌య్య‌చౌద‌రి మండిపడ్డారు.  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మాన్ని మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...టీడీపీ ప్ర‌భుత్వం పేద‌ల పాలిట రాక్ష‌స ప్ర‌భుత్వంగా మారింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం చోడవరం నియోజకవర్గ ఇంఛార్జ్ కరణం ధర్మశ్రీ గౌరీపట్నంలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. పింఛన్లు రావడం లేదు. ఇళ్లు ఇవ్వడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని స్థానిక వరద ముంపు బాధితులు తమ గోడును నేతలకు చెప్పుకున్నారు. ఎన్నికల ముందు అదీ చేస్తా ఇదీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్కటీ చేయడం లేదని ప్రజలు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 

మరోవైపు, పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కళావతి గడపగడపలో పర్యటించారు. బాబు నయవంచక పాలనను ప్రజలకు వివరించారు. బాబు పాలనకు సంబంధించి మార్కులు వేయాలని కరపత్రాలను అందించి సమాధానాలు రాబట్టారు. బాబుకు ఒక్క మార్కు కూడా పడలేదు. 

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా అర‌కు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త అరుణ‌కుమారి హుకుంపేట మండ‌ల ప‌రిధిలోని త‌డిగిరి పంచాయతీలో పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్ర‌జ‌లు చంద్ర‌బాబును న‌మ్మి ఓట్లేసినందుకు న‌ట్టేటా ముంచాడ‌ని ఆమె ఫైర్ అయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికార ప్ర‌తినిధి ఐన శెట్టి అప్పాలు, పార్టీ నాయ‌కులు ర‌ఘునాథ్‌, సీద‌రి సాంబ‌, స‌దాని స‌ర్వేశ్వ‌ర్ రావు, క‌మిలి చిన్నాభి, కామిడి స‌త్య‌నారాయ‌ణ‌, పాకురి స‌దాసివ రావు, కొండ‌బాబు సోమ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

పార్టీ విశాఖ‌ప‌ట్నం జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్ ఆధ్వ‌ర్యంలో గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలోని 60వ వార్డు కుందమాంబ కాల‌నీలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాజ‌కీయంలో అనుభ‌వం ఉన్న వ్య‌క్తి అని గెలిపించిన ప్ర‌జ‌ల‌ను  చంద్ర‌బాబు న‌ట్టేటా ముంచాడ‌ని ఆయ‌న విమర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో గాజువాక స‌మ‌న్వ‌య క‌ర్త తిప్ప‌ల నాగిరెడ్డి, మాజీ కార్పొరేట్ వురుకూటి అప్పారావు, వార్డు ప్రెసిడెంట్ అప్పారావు, ముర‌ళీదేవి, గంగాభ‌వానీ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top