బాబు పాలనకు మూడింది

2019లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగనే
విశాఖ(యలమంచిలి)చంద్ర‌బాబు మోసాలు ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయాయ‌ని, ప్ర‌జ‌లు బాబును న‌మ్మే ప‌రిస్థితుల్లో లేర‌ని యలమంచిలి నియోజ‌కవర్గ కన్వీనర్ ప్రగడ నాగేశ్వర రావు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మునగపాక మండలం సూచికోండ గ్రామంలో ప‌ర్య‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు త‌గిన బుద్ధి చెప్పి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికే ప‌ట్టం క‌డ‌తార‌ని ఆయ‌న తెలిపారు. చంద్ర‌బాబు ప్ర‌పంచాన్ని తానే నిర్మించాన‌ని చెబుతూ, విదేశాలు తిరుగుతున్నార‌ని ఎద్దేవా చేశారు. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికార‌మా ప్ర‌తిప‌క్ష‌మా అని ఆలోచించ‌కుండా ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయాల‌నే త‌ప‌న‌తో నిరంత‌ర శ్రామికుడిలా ప్ర‌జ‌ల‌చెంతే ఉంటున్నార‌న్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిన కార్య‌క్ర‌మ‌మ‌ని ఆయ‌న తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

వైయస్సార్సీపీకి విశేష ఆదరణ
విశాఖ‌ప‌ట్నం )))విశాఖ‌ప‌ట్నం నార్త్ లోని 39వ వార్డులో  తైనాలవిజయకుమార్ ఆధ్వర్యంలో  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లి క‌ర‌ప‌త్రాలు పంచారు. చంద్ర‌బాబు మోసాలను ప్రజలకు వివ‌రించారు. వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు కార్య‌కర్త‌లు నిర్విరామంగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతున్నారు. ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని  ఆశ‌గా ఎదురు చూస్తున్నార‌ని చెప్పారు.  నమ్మించి మోసం చేసిన చంద్ర‌బాబుకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

చంద్ర‌బాబు చేసేవ‌న్నీ మోసాలే...
విశాఖ(గాజువాక)చంద్ర‌బాబు నాయుడు పేరుకే ముఖ్య‌మంత్ర‌ని కానీ ఆయ‌న చేసేవ‌న్నీ చిల్ల‌ర ప‌నులేన‌ని  వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా గాజువాక నియోజకవర్గ పరిధిలోని పిన్నమడక తదితర ప్రాంతాల్లో  ప‌ర్య‌టించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... ప్ర‌జాబ్యాలెట్ సేక‌ర‌ణ‌లో చంద్ర‌బాబు చేసింది శూన్యమ‌ని స్ప‌ష్ట‌మైపోయింద‌ని వారు తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పాల‌న‌తో విసిగిపోయారు.
పెనుగొండ‌))గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్రమంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల్లోకి బాగా చేరువైంద‌ని వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు అన్నారు. పెనుగొండ మండ‌లం వెంక‌టరామ‌పురంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. చంద్ర‌బాబు మోసాలు ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింద‌ని, ప్ర‌జ‌లు ఇంక చంద్ర‌బాబును న‌మ్మే ప‌రిస్థితుల్లో లేర‌ని వార‌న్నారు. ప్ర‌జ‌లను మోసం చేస్తూ,  ఎందాకా అమ‌రావ‌తి అంటూ బాబు కాలక్షేపం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రజలు బాబుకు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌న్నారు.  కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

ఆచంట‌))రోజురోజుకు ప్ర‌జ‌ల్లో వైయ‌స్ఆర్ సీపీ పై ఆద‌రణ పెరుగుతోంది.  పార్టీ చేప‌డుతున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల మ‌న్న‌ల‌ను పొందుతూ ముందుకు సాగుతోంది. ఆచంట మండ‌లం, మానేవారి పాలెంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్రమానికి విశేష స్పంద‌న ల‌భించింది. వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే బాబు మాత్రం విదేశాల‌లో సేద‌తీరుతున్నాడ‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దిగిపోయే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

బాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత
పోడూరు))చంద్ర‌బాబు పాల‌న‌కు కాలం చెల్లింద‌ని పోడూరు వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా పోడూరు మండ‌లం గుమ్ముళ్లూరు గ్రామంలో పర్య‌టించారు. ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పాల‌న‌లో విసిగి వేసారిపోయార‌ని, త్వ‌ర‌గా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం కావాల‌ని కోరుతున్నార‌న్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్సీపీ కార్య‌క్ర‌మం ద్వారా చంద్ర‌బాబు పై ప్రజల్లో వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంద‌న్నారు.  ప్ర‌జాబ్యాలెట్ సేక‌ర‌ణ‌లో చంద్ర‌బాబు పాల‌న‌కు సున్నా మార్కులే వ‌చ్చాయ‌న్నారు. కార్య‌క్ర‌మ‌లో వైయ‌స్ఆర్ సీపీ, నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top