దగాకోరు బాబును సాగనంపుదాం

తూర్పుగోదావరి జిల్లాలో గడపగడపకూ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అంబాజిపేట మండలం వక్కలంక గ్రామంలో గన్నవరం నియోజకవర్గ  కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నేతలు గడపగడపలో పర్యటించారు. మరోవైపు, జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త ముత్యాల శ్రీనివాస్  ఆధ్వర్యంలో గండేపల్లి మండలం సుబ్బాయమ్మపేట గ్రామంలో నేతలు ప్రజల వద్దకు వెళ్లారు.  ఈసందర్భంగా ప్రజలు తమ కష్టాలను  వైయస్సార్సీపీ శ్రేణులకు చెప్పుకొని బాధపడ్డారు. మోసపూరిత హామీలతో బాబు దగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది మన ప్రభుత్వమని వైయస్ జగన్ సీఎం అయితే కష్టాలన్నీ తీరిపోతాయని ఈసందర్భంగా నేతలు ప్రజలకు భరోసా కల్పించారు. 


విశాఖ జిల్లా  యలమంచిలి నియోజికవర్గం కన్వీనర్  నాగేశ్వర రావు గొల్లలపాలెం గ్రామంలో గడపగడపలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ టీడీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను వంచించిన బాబుకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 


Back to Top