హామీల అమ‌లుకై పోరాడాలి

శ్రీ‌కాకుళంః ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల అమ‌లు కోసం ప్ర‌తి ఒక్క‌రు పోరాటం చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన కృష్ణ‌దాస్ పిలుపునిచ్చారు. శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట్ నియోజ‌క‌వ‌ర్గంలోని సార‌వ‌కోట మండ‌లం అవ‌లంగి గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ్రామ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకొని అబ‌ద్ధ‌పు హామీల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను ఇంటింటికి అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసి విదేశాలు తిరుగుతూ వంద‌ల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని చంద్ర‌బాబు వృథా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ నేత‌లు ఓట్లు దండుకొని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని విమ‌ర్శించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 


Back to Top