నిరుద్యోగభృతి ఇవ్వకపోతే ఆందోళన తప్పదు

కాకినాడః వైయస్సార్సీపీ లీడర్ ముత్తా శశిధర్ కాకినాడ 4వ వార్డులో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వార్డులో రోజురోజుకు  ప్రజల కష్టాల లిస్ట్ పెరుగుతుందే తప్ప తరగడం లేదని శశిధర్ అన్నారు. ఎక్కడ కూడ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. పాకలన్నీ తీయించి ఇళ్లు కట్టిస్తాం, నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పి బాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. వచ్చే బడ్జెట్ లో నిరుద్యోగులకు  భృతి అందకపోతే రానున్న రోజుల్లో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. 

Back to Top