చంద్రబాబుపై తీవ్ర అసహనం

రోడ్డు వేశారు.. క‌ల్వ‌ర్టు మరిచారు
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  పిండిగొయ్య‌లోని బుచ్చ‌య్యన‌గ‌ర్ నుంచి గ్రామంలోకి వ‌చ్చే మొద‌ట వీధిలో ఎడ‌మ‌వైను క‌ల్వ‌ర్టు నిర్మాణం చేపట్ట‌క‌పోవ‌డంతో రోడ్డు కుంగిపోతుంద‌ని వైయ‌స్సార్‌సీపీ రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ ఆకుల వీర్రాజు అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న పిండిగొయ్య‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అందించి చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌పై మార్కులు వేయించారు. 

అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌డం లేదు
నెల్లూరు: వ‌ర‌ద ముంపున‌కు గురై ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, అభివృధ్ధి కార్య‌క్ర‌మాలు ఇంత‌వ‌ర‌కు చేప‌ట్టలేద‌ని గుర్రాల‌మ‌డుగు సంఘం ప్ర‌జ‌లు న‌గ‌ర ఎమ్మెల్యే డాక్ట‌ర్ పి. అనిల్‌కుమార్‌యాద‌వ్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్యక్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానిక 16వ డివిజ‌న్‌లో ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.... టీడీపీ ప్ర‌భుత్వం మాట‌ల ప్ర‌భుత్వ‌మే కానీ... చేత‌ల ప్ర‌భుత్వం కాద‌ని మ‌రోసారి రుజువైంద‌న్నారు. బాబు సర్కార్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతున్నా ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో నిత్యం కొట్టుమిట్టాడుతునే ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ఇదెక్క‌డి న్యాయం?
ఆదోని:  రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాక‌ట్టు పెట్టిన సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో రోజురోజుకు అస‌హ‌నం పెరుగుతుంద‌ని ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్‌రెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని చిన్న‌పెండేక‌ల్ గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేకు గ్రామ నాయ‌కులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. ఎన్నిక‌లకు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌న్ని ఒట్టి నీటిమూట‌లుగానే మిగిలిపోయాయ‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సీఎం అయితేనే ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరుతాయ‌ని సాయిప్ర‌సాద్‌రెడ్డి పేర్కొన్నారు. 

Back to Top