పచ్చచొక్కాలకే పథకాలు..చంద్రబాబును నమ్మొద్దు

శ్రీకాకుళం(వాడాడ))నమ్మిన వారిని వంచించడంలో దిట్టగా పేరుగాంచిన చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రజలకు సూచించారు. గార మండలం వాడాడ పంచాయతీలో గడపగడపకు వైయస్ఆర్  కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడేళ్లుగా ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ధర్మాన వద్ద మొరపెట్టుకున్నారు. పచ్చచొక్కాల వారికే పథకాలు మంజూరు చేస్తున్నారని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తానన్న చంద్రబాబు బిక్షాధికారులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Back to Top