పచ్చచొక్కాలకే ప్రభుత్వ పథకాలు

పిఠాపురం: పథకాలన్నీ పచ్చ చొక్కాలు తొడక్కున్న నాయకులకే ఇస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా కనీసం ఫించను కూడా ఇవ్వడం లేదు....మూడేళ్లుగా ఒక్కరికి ఇంటి లోను కూడా ఇవ్వలేదు అంటు  తాటిపర్తి ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో మంగళవారం తాటిపర్తిలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అపర్ణాదేవి ముఖద్వారం, కొత్తపేట ప్రాంతాల్లో ఇంటింటా పర్యటించి బాబు అబద్ధపు హామీలతో కూడిన కరపత్రాలను పంచారు. ఎన్నికలు ముందు బాబు ఇచ్చిన అబద్ధపు హామీలను  దొరబాబు గ్రామస్తులకు వివరించారు. ఈసందర్భంగా చేనేత కార్మికులు,  మహిళలు, రైతులు  పలు సమస్యలను దొరబాబుకు తెలియచేశారు.  65 సంవత్సరాలు వచ్చిన ఫించను ఇవ్వలేదని.. తనభార్య నడవలేని స్థితిలో ఉందని ...పూట గడవడం కష్టంగా ఉందని గ్రామానికి చెందిన కాకరపర్తి సహదేవుడు కన్నీరు మున్నీరయ్యారు. కనీసం రేషన్‌బియ్యం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  డ్వాక్రా, వ్యవసాయ రుణమాఫీ అంటూ ఓట్లు వేయించుకున్నారని తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకుండా మాట తప్పారని పలువురు మహిళలు తెలిపారు. కనీసం స్థానిక సమస్యలను కూడా పట్టించుకోవడం లేదన్నారు.  ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా మోసం చేశారన్నారు. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను ఏఒక్కటి నెరవేర్చలేదన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కాకుండా పచ్చకార్యకర్తలకు ప«థకాలు ఇస్తున్నారని తెలిపారు. ప్రజలు పక్షాన పోరాడేందుకు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు. బాబుకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గసభ్యులు కడిమిశెట్టి కుమారభాస్కరరెడ్డి, క్రరి ప్రసాద్, స్థానిక నాయకులు గారపాటి బుజ్జి, దాసం కామరాజు, సామినీడి గంగాధర్, దాసం వెంకటేష్, గంటా బాబూరావు, గాబు తాతాజీ, జలిగంపల బాబూరావు, నల్లల రాంబాబు, భారతాల శ్రీను, తోటూరి దొరయ్య, దాసం శ్రీను, సాద కనకయ్య, చిక్కం లోవరాజు, కాకి ఏసుబాబు, నామా నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు. 

Back to Top