ప్రజల దరి చేరని పథకాలు

ఏ గ‌డ‌ప తొక్కినా స‌మ‌స్య‌లే...
య‌ల‌మంచిలి(పేద‌పాడు):  ఏ గ‌డ‌ప‌కు వెళ్లిన‌... ఏ వ్య‌క్తిని ప‌ల‌క‌రించిన స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్సార్‌సీపీ స‌మ‌న్వ‌య క‌ర్త ప్ర‌గ‌డ నాగేశ్వ‌ర‌రావు అన్నారు. అచ్యుతపురం మండ‌ల ప‌రిధిలోని పేద‌పాడు గ్రామంలో ఆయ‌న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌పై మార్కులు వేయించారు. 

ప‌చ్చ‌చొక్కాల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
ముదినేప‌ల్లి(బొమ్మినంపాడు):  ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు మాలాంటి పేద‌ల ద‌రి చేర‌డం లేద‌ని, ప‌క్కా ఇల్లు క‌ట్టుకుందామ‌న్న ఆశ‌లు అడియాశ‌లుగానే మిగిపోయాయ‌ని బొమ్మినంపాడు గ్రామ‌స్తులు వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దూలం నాగేశ్వ‌ర‌రావు(డీఎన్నార్‌) ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌లంలో ప‌ర్య‌టిస్తూ చంద్రబాబు మోస‌పూరిత హామీల‌ను వివ‌రించారు. 

Back to Top