పేదలకు అందని ఫలాలు..పచ్చనేతలకే పథకాలు

ప్రకాశంః వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం రాష్ట్రంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రతి గడపలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు టంగుటూరు పట్టణంలోని 20వ వార్డులో గడపగడపలో పర్యటించారు. బాబుకు ఓటేసి మోసపోయామని, పథకాలన్నీ పచ్చనేతలకే చేరుతున్నాయి తప్ప తమకు అందడం లేదని  ప్రజలు కన్నీరుపెడుతున్నారు. తమ వద్దకు వచ్చిన వైయస్సార్సీపీ నేతలకు తమ సమస్యలు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దోచుకోవడమే పనిగా పాలన సాగిస్తున్న బాబుకు తగిన బుద్ధి చెప్పాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. 

Back to Top