నాణ్యతలేని రోడ్లను వేస్తున్నారు

పటమట : రామలింగేశ్వరనగర్‌ ప్రాంతంలో అంతర్గతంగా వేసే రోడ్లన్నీ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేస్తున్నారు.. రోడ్డు వేసిన మూడు నెలలకే పగిలిపోతున్నాయి.. సీసీరోడ్లయితే రాళ్లు పైకి లేస్తున్నాయని, ఈ ప్రాంతంలో నిర్మించే డ్రైనేజీ నిర్మాణాల్లో కూడా నాణ్యతలను పాటించకుండా వేశారని పలువురు పటమట 14వ డివిజన్‌లోని రామలింగేశ్వన నగర్‌ వాసులు వైయస్‌ఆర్‌ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్‌కు విన్నవించుకున్నారు. మంగళవారం వైయస్‌ఆర్‌ సీపీ తలపెట్టిన గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం రామలింగేశ్వనగర్‌ ప్రాంతంలోని భవానీరోడ్డు, రఘు రోడ్డు, గులాభీ రోడ్డు, పడవల రేవు సెంటర్, ఠాగూర్‌ వీధి తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. స్థానికంగా సమస్యలు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడు లేరని, డ్రైనేజీలు పొంగుతున్నా, చెత్తను శుభ్రపరచకపోయినా ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని, కృష్ణాపరివాహన ప్రాంతం కావటంతో నదిలోనుంచి కుక్కలు వచ్చి రాత్రులు రోడ్డుపై తిరగలేని పరిస్థితి నెలకొంటుందని స్థానికులు బొప్పనకు విన్నవించుకున్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ కేవలం అభివృద్ధి పేరుతో ఉకదంపుడు ప్రచారాలు చేస్తుందే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించటంలో విఫలమయ్యిందని విమర్శించారు. త్వరలోనే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరే రోజులు రానున్నాయని, రాజన్న పాలన వచ్చే సమయం ఆసన్నమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్‌; కార్పోరేటర్లు పల్లెం రవి, మద్దా శివశంకర్‌; స్థానిక నాయకులు గాదిరెడ్డి అమ్ములు, కల్లి శివ, ఎ్రరపోతు సూర్యనారాయణ, ధనలక్ష్మీ, శివ, దేవభక్తుని సుబ్రమణ్యం, బలరామిరెడ్డి, బోయిన రాఘవ, మిరియాల అర్జునరావు, సుంకర నాగేంద్ర, సత్వవేడి నరసింహారావు, గాదిరెడ్డి బోసు, మాదాసి భాను, కుమ్మిడి శ్రీనివాసరెడ్డి, లేళ్ల సుబ్బారావు, కానుకోట నాని, రాయపాటి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. 

రేపు కొండూరులో గడపగడపకు 
ఎ.కొండూరు:మండల కేంద్రమైన ఎ.కొండూరులో  బుధవారం  గడప గడపుకు వైయస్సార్‌కార్యక్రమం నిర్వహిస్తున్నామని  రాష్ట్ర నాయకుడు  నరెడ్ల వీరారెడ్డి, జెడ్పీటీసీ పాలం ఆంజనేయులు మంగళవారం తెలిపారు.  ఈ కార్యక్రమంలో స్థానిక  ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పాల్గొని  ప్రజా సమస్యలు తెలుసుకుంటారని  తెలిపారు.  కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. 
 తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top