నవరత్నాల పథకాలు ప్రతి గడపకు తీసుకెళ్లే భాధ్యత మనపై ఉంది

– ప్రజాక్షేత్రంలో బూత్‌కమిటీ నాయకులకే కీలకం
– నవరత్నల పథకాలతో ప్రతికుటుంబానికి లబ్ది చేకూరుందని చాటిచెప్పాలి
– ప్రజలకు చేరువై వారిలో నమ్మకాన్ని పెంచాలి
– హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ పిలుపు

హిందూపురం అర్బన్‌: నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్దిచేరుకుందని ప్రతిగడపకు వెళ్లి వివరించి ప్రచారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ గుర్తుగా జగనన్నకు తోడుగా నవరత్నలసభ బుధవారం మండల కన్వీనర్‌ బసిరెడ్డి అధ్యక్షతన సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్‌ కమిటీసభ్యుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్‌ మాట్లాడుతూ నవ్యంధ్రాకు నవరత్నల పథకాలు నిజమైన రత్నలే.. ఈపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి బూత్‌కమిటీలు పటిష్టంగా పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు పథకాల గురించి క్షుణంగా వివరించి వారిని వైఎస్‌ జగన్‌మోహన్‌ని బలపర్చేవిధంగా కృషి చేయాలన్నారు. ఏసమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు ప్రతికార్యకర్త, బూత్‌కమిటీ నాయకుడి వెంట వస్తానన్నారు. బూత్‌కమిటీ సభ్యులు పథకాలను వివరించడంతోపాటు ప్రధాన సమస్యలు కూడా తెలుసుకుని వాటి పరిష్కరానికి కృషిచేయాలన్నారు. మోసానికి మారుపేరు టిడిపి ఓట్లు వేయించుకోవడానికి కుదరకపోతే ఆ ఓట్లను గల్లంతుచేసి కుటిలబుద్ది ఉంటుందని జాగ్రత్తగా ఉండాలన్నారు.
సీఎం చంద్రబాబు పక్కా మోసకారి .ఎన్టీరామారావు కుటుంబసభ్యులతో కలిసి కూతుర్ని ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిన ఘనుడు. ఓట్లకోసం ఆల్‌ఫ్రీ అంటాడు. ఎన్నికలల్లో ఇచ్చిన వంద హామిలు నేటికి నెరవేర్చలేదు. అలాంటి వ్యక్తి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు తెలియజేయాలన్నారు.సరైన వ్యక్తిని స్థానికుడి ఎన్నిక చేసుకోలేపోతే అభివృద్ధి కుంటుపడిపోతుంది. ప్రజాసమస్యలు పట్టించుకునే వారు ఉండరని గమనించాలన్నారు. తాను మూడుసార్లు ఓడినా ప్రజాక్షేత్రం నుంచి ఎప్పుడూ పక్కకు పోలేదని నిరంతరం ప్రజాసేవాలో అందరికి చేరువాలో ఉన్నానన్నారు. కొందరు కావాలనే దుష్రచారం చేస్తున్నారు. నేను అందరివాడినని అందరూ కావాలని కోరుకునే వాడినన్నారు. అంతకు మునుపు రాష్ట్ర యువజన ప్రదాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్‌ మాట్లాడుతూ నవరత్నల పథకాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంక్షేమానికి నందిపలికారు. బూత్‌కమిటిలు ప్రజలకు చేరువకావాలి. ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. ప్రతిఇంటికి ఈపథకాలవల్ల జరిగే లాభాలు వివరించాలన్నారు. రానున్న ఎన్నికల వైఎస్సార్‌సీపీ విజయబావుటాను ఎగురువేసే విధంగా కష్టపడాలని చెప్పారు. బిబ్లాక్‌ కన్వీనర్‌ మల్లికార్జున మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనను తిరిగి రాష్ట్రంలో తీసుకువచ్చి హరితాంధ్రాప్రదేశ్‌గాను సుభిక్షమైన సుపరిపాలనను తీసుకురావడం ఒక వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమౌతుందన్నారు. నవరత్నాల పథకాలు ప్రతిఇంటా సుఖసంతోషాలను తీసుకువస్తుందన్నారు. 

Back to Top