చెక్కుచెదరని ప్రజాదరణ వైయస్సార్సీపీ సొంతం

దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా సాగుతుంది. రెండున్నర సంవత్సరాలుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆగడాలను పార్టీ నేతలు గడప గడపకూ తీసుకువెళ్లి ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు బాబు ఇచ్చిన హామీలపై పార్టీ ప్రచురించిన ప్రజాబ్యాలెట్‌ను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రజలతో మార్కులు వేయిస్తున్నారు. గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.


Back to Top