అలుపెరగని పోరాట యోధుడు మన వైయస్ జగన్

శ్రీకాకుళం(నరసన్నపేట))ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గొప్ప ప్రజానాయకుడు వైయస్ జగన్ అని, అన్ని వర్గాల ప్రజలు అతన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని వైయస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా జలుమూరు మండలం పాగోడు గ్రామపంచాయతీ పర్యటించారు. మహానేత వైయస్ఆర్ హయాంలో తీసుకున్న పింఛన్లే తప్ప టీడీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్లే రావడం లేదని వృద్ధులు, మహిళలు ధర్మాన దృష్టికి తీసుకొచ్చారు. కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు తప్ప పెన్షన్ మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం కోసం మనమంతా జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Back to Top