టీడీపీ పాలనలో అభివృద్ధి జాడేలేదు

అనంతపురం: ఎన్నికల సమయంలో 600ల హామీలను ప్రజలకు గుప్పించి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. కనేకల్‌ మండలం నాగేపల్లి గ్రామంలో రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాల జాడే కానరావడం లేదన్నారు. తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసి ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్నాడని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బులు విసిరి ప్రజల ఓట్లను కొనుగోలు చేసి మళ్లీ అధికారం చేజిక్కించుకుందామనే ఆలోచనలతో బాబు కుట్రలు పన్నుతున్నాడన్నారు. 2014లో టీడీపీకి ఓటేసి మోసపోయిన ప్రజలు మళ్లీ ఆ తప్పు చేయరని స్పష్టం చేశారు. 2017 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Back to Top