త్వరలో రాజన్న పాలన వస్తుంది

తూర్పుగోదావరి))మండపేట పట్టణం 20, 21వ వార్డులలో వైయస్సార్సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఎన్నిసార్లు ఆఫీసులకు వెళ్లి పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా రాలేదు(కంచర్ల అచ్చిరాజు వయస్సు76సం). హౌసింగ్ లోన్ కొరకు  ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నిసార్లు దరఖాస్తు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు(బెవర గణేష్) అని వార్డు ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ...ఈ ప్రభుత్వం గద్దె నెక్కాక ప్రజాసమస్యలు గాలికి వదేలేసిందని విమర్శించారు.  చంద్రబాబు సర్కారు వైఫల్యాలఫై ముద్రించిన ప్రజాబ్యాలెట్ ను ఇంటింటికి పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజన్న పాలన త్వరలో వస్తుంది అని భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామప్రజలు అధిక సంఖ్యలో  ​పాల్గొన్నారు. 
Back to Top