త్వరలోనే వైయస్ జగన్ నాయకత్వంలో రాజన్న పాలన

తూర్పుగోదావరిః కపిళేశ్వరపురం మండలం అంగర గ్రామంలో జరిగిన గడపగడపకు వైయస్సార్ సిపి కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు .ఈ క్రమంలో ప్రతి గడపకు వెళ్ళి గత ఎలక్షన్ లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలపై ముద్రించిన ప్రజా బ్యాలెట్ పంపిణీ చేసారు. అంగర గ్రామ ప్రజలు తమ తమ ఏరియాలలో ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు  అర్హత ఉన్నా పెన్షన్  మంజూరు చేయటం లేదు అని  ఆవేదన వ్యక్తం చేశారు. లీలాకృష్ణ మాట్లాడుతూ... ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలను గాలికి వదిలేసి, ప్రజలను మోసగించి పరిపాలన సాగిస్తున్నారని బాబుపై మండిపడ్డారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజన్న పాలన వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగుమళ్ల రాంబాబు ,మాచవరం ఎంపీటీసీ మేడపాటి లక్ష్మీప్రసాద్ రెడ్డి, నెల సూర్యకుమార్, , గంగుమళ్ల నారాయణమూర్తి, సల కోటీశ్వరావు,నేలపూడి శ్రీనివాసరావు, పంతం రాజు, , చిల్లా రాంబాబు, మందపల్లి నరసింగరావు,పోతన నాగేశ్వరావు, ఎర్ర వీరన్న,కాకర్ల శ్రీమన్నారాయణ, పొలమూరి విజయ్ , తిరుసుల శ్రీను, పెయ్యల  యాకోబు, సరకుల అబ్బులు ,పొలముల  సత్తిబాబు   మరియి ముఖ్య నాయకులు , ప్రజలు అధిక సంఖ్యల్లో పాల్గొన్నారు. Back to Top