రాజ‌న్న రాజ్యం జ‌న‌నేత‌ వైయస్ జగన్ తోనే సాధ్యం

కందుకూరు: రాజన్న రాజ్యం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైయ‌స్ఆర్ సీపీ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ తూమాటి మాధ‌వ‌రావు స్ప‌ష్టం చేశారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిల‌ని గూడ్లురు మండ‌లం స్వ‌ర్ణాజీపురం గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్ర‌బాబు మోసాల‌ను స్థానిక ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అనంత‌రం మాధ‌వ‌రావు మాట్లాడుతూ దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఆయ‌న మ‌ర‌ణాంత‌రం స‌క్ర‌మంగా అమ‌లు జ‌ర‌గ‌డం లేద‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైయ‌స్ఆర్ ప‌థ‌కాల‌ను నీరుగారుస్తుంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించి రాష్ట్రాన్ని టీడీపీ నేత‌లు లూటీ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాకుండా చంద్ర‌బాబు త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రానికి తాక‌ట్టుపెట్టార‌ని మండిప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్య‌క్తి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని కొనియాడారు. హోదా పోరాటంలో యువ‌త అంతా వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో గూడ్లురు జెడ్పీటీసీ వెంక‌ట్రామిరెడ్డి, పార్టీ క‌న్వీన‌ర్ కృష్ణ‌, యూత్ అధ్య‌క్షులు కోటేశ్వ‌ర‌రావు, కిషోర్‌, మేథుష‌ళ‌, భాపిరెడ్డి, దాస‌రి మ‌ల్యాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top