నవరత్నాలతోనే రాజన్న రాజ్యం

–నధుల అనుసంధానం పేరుతో బాబు దోపిడీ
–వైయస్‌ఆర్‌ కుటుంబానికి విశేష స్పందన

నందికొట్కూరు. తెలుగు దేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని 13వ, వార్డులో వైయస్‌ఆర్‌ కటుంబ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.... ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రకటించిన నవరత్నాలతోనే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పేద ప్రజలకు శాశ్వత సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. నధుల అనుసంధానం పేరుతో నధులను దోచేస్తూ వేల కోట్ల నిధులను దోచుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బూతు కమిటీలు ఇంటింటికి తిరిగి సీఎం చేస్తున్న మోసాలను వివరించి వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేర్పించాలన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. యువతీ, యువకులు, మహిళలు, వృద్ధులు, రైతుల సైతం వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు  రాజశేఖర్, 13వ వార్డు ఇండిపెండింట్‌ కౌన్సిలరు చంద్రశేఖర్, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రవికుమార్, సుధాకర్, ఏసన్న, తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top