రానున్నది రాజన్న రాజ్యం

తూర్పుగోదావరిః మండపేట మండలం మెర్నిపాడు  గ్రామంలో  పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటిలో వేగుళ్ల లీలాకృష్ణకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. గ్రామంలో పారిశుధ్యం చాల అధ్వాన్నంగా ఉందని, ( k .దుర్గ ) గ్రామంలో  రోడ్డు, డ్రైనేజీ లేవని మహిళలు వాపోయారు. ఈ క్రమంలో ప్రతి గడపకు వెళ్ళి గత ఎలక్షన్ లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలపై ముద్రించిన ప్రజా బ్యాలెట్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ.... రాబోయే కాలంలో వైయస్ జగన్  నాయకత్వంలో రాజన్న పాలన వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో  ​పాల్గొన్నారు.


Back to Top